పేదల సొంతింటి కల నెరవేరుస్తాం

ఆదివాసీ బిడ్డలకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ----రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం


WhatsApp Image 2026-01-22 at 8.43.00 AM

 

ఆదిలాబాద్ జిల్లా :   పేదల సొంతింటి కలను సాకారం చేయడం, ఆదివాసీలకు సమగ్రాభివృద్ధి కల్పించడంతో పాటు వారి పిల్లలకు నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకొని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ తేజవత్‌లతో కలిసి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కుమ్మరి తండా, దంతన్‌పల్లి, పులిమడుగు ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

WhatsApp Image 2026-01-22 at 8.43.01 AM

రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

ఉట్నూర్ మండలం కుమ్మరి తాండలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. గిరిజన బిడ్డలు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించి, దేశ భవిష్యత్తును నిర్మించే ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు.ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. వీటి ద్వారా రైతులకు, గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక సంక్షేమ పథకాలపై సమగ్రంగా వివరించారు. ప్రజల సంక్షేమo కోసం నేరుగా నగదు బదిలీ ద్వారా ఇప్పటివరకు రూ.1,21,874 కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఏటా మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో రూ.12,500 కోట్లతో ‘ఇందిరా సౌర గిరి వికాసం’ పథకం అమలు చేస్తున్నామని, వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో పాటు రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని తెలిపారు. 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే గిరిజన మహిళలకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ (ROFR) భూ హక్కు పట్టాలను ఉప ముఖ్యమంత్రి అందజేశారు. చిక్మాన్, పులిమడుగు త్రివేణి సంగమం ప్రాజెక్టులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం గిరిజన దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసి, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ క్యాలెండర్‌తో పాటు ‘జ్ఞాన ధార’ మ్యాగజిన్‌ను ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోథ్ ఎమ్మెల్యే అనిల్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

 

WhatsApp Image 2026-01-22 at 8.43.00 AM(1)

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలి.  బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్. ప్రశాంతమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలి. బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్.
        అనంతగిరి  : ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని బిజెపి నాయకులు చిలకముడి రవి కిరణ్ అన్నారు. అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో ఈనెల 8వ తేదీన
24 గంటల్లో ఛేదించిన దుండిగల్ వృద్ధ మహిళ హత్య కేసు
వృత్తి శిక్షణా కోర్సుల తరగతులను పరిశీలించిన డీజిఎం - ఎస్ అనిల్ కుమార్
చట్టబద్ధంగానే ఇళ్ళ స్వాధీనం: కార్యనిర్వహణాధికారిణి లావణ్య ..
ఒకే వార్డులో అన్నదమ్ముల పోటీ…
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయి. పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్. పర్వతగిరి సి.ఐ బి.రాజగోపాల్.
ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి