ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం పై కాంగ్రెస్ జెండా ఎగరాలి ------- ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్

అదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణం పరిధిలోని వార్డ్ నెంబర్ 42 రిక్షా కాలనీ, ఫిల్టర్ బెడ్ అభ్యర్థి కంబ్లె స్వాతి - మంగేష్ తరపున ప్రచార కార్యక్రమంలో ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ తో కలిసి పాల్గొన్న డిసిసి అధ్యక్షులు డా నరేష్ జాదవ్... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విన్నవించారు, కాంగ్రెస్ పార్టీ అంటే గరీబోళ్ల పార్టీ అని గరీబోళ్ల సమస్యలు తీర్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీ వార్డులో ఇందిరమ్మ ఇల్లు రావాలన్న రోడ్లు నాలాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విన్నవించారు కుల మతా లతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపి పార్టీకి ఓటు వేయకూడదని తెలిపారు,గత 10 సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పేదలకు కూడా ఇల్లు నిర్మించలేదని యువకులకు ఉద్యోగాలు రాలేదని, ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, పేదలకు సన్నబియ్య పథకం, నా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీ వార్డ్ అభివృద్ధి చేసుకోవాలని విన్నవించారు, ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి , మాజీ డిసిసి సాజిద్ ఖాన్ , మాజీ టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత , మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లె పూల నరసయ్య , మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి , కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ ,ఏలేటి అశ్విన్ రెడ్డి , గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్యాల కరుణాకర్ ,జిల్లా యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పరమేశ్వర్ , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు* .
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

