బలవంతపు వసూళ్లకు పాల్పడిన నిందితులు అరెస్ట్, రిమాండ్

బలవంతపు వసూళ్లకు పాల్పడిన నిందితులు అరెస్ట్, రిమాండ్

•డబ్బులు ఇవ్వకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులు

•ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్

ఉట్నూర్, : ఉట్నూర్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్ నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసి, మరింత డబ్బు ఇవ్వాలని బెదిరించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే, ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న ఫిర్యాదుదారుని వద్దకు గత కొద్ది రోజులుగా నిందితులు ఫోన్ కాల్స్ చేసి ఒక కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తూ, ఈ నెల 26వ తేదీన హాస్టల్‌కు వెళ్లిన నిందితులు రూ.5,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి పదేళ్లు జైలుకు పంపిస్తామని బెదిరించారు. గత ఆరు నెలల్లో ఇదే విధంగా రెండు సార్లు రూ.3,000 చొప్పున మొత్తం రూ.6,000 వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. అరెస్టు చేసిన నిందితులు నేతావత్ రాందాస్ (53) s/o  దివంగత రూప్లా, పాత ఉట్నూర్, నేతావత్ జైల్‌సింగ్ (28) s/o రాందాస్ నాయక్, పాత ఉట్నూర్. బెదిరింపులు, బలవంతపు వసూళ్లు (ఎక్స్‌టార్షన్) వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్ హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా బెదిరింపులకు గురైనట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
 
Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget