ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి

ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అయితే అవి విధానాలపై ఉండాలని, వ్యక్తిగత దూషణలుగా మారకూడదని హితవు పలికారు.రాజకీయాల్లో హుందాతనం పాటించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని, ముఖ్యంగా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే లాంటి సీనియర్ నేత మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో రాజకీయ చర్చను దిగజార్చవద్దని, ప్రజా సమస్యలు, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, పాలనపై నిర్మాణాత్మక చర్చకు కాంగ్రెస్ ముందుకు రావాలని సవాల్ విసిరారు. వ్యక్తిగత ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని, ఇటువంటి చర్యలు సరికాదన్నారు. ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఖర్గే తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని భరత్ ప్రసాద్ డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు తమ మాటలతో, చేతలతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం
గంభీరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ  చైర్మన్ మహ్మద్ హమీద్, వైస్ ఛైర్మ న్ మేడ...
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ హుస్నాబాద్ విద్యార్థుల ఎంపిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం
హుస్నాబాద్‌లో 28 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గ్రాడ్యుయేట్లలో తగ్గిన జోష్.. MLC ఓటరు నమోదుకు తూతూ మంత్రంగా స్పందన!
ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి