ప్రజలతో మమేకం కావాలి
రాజుపేట కాంగ్రేస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నవీన్ కు ఘన సన్మానం
కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు
గంభీరావుపేట : కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలతో మమేకమై ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు పిలుపునిచ్చారు, ఆదివారం రాజుపేట గ్రామం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గా ఎన్నికైన దిడ్డి నవీన్ కు గ్రామస్థులు గ్రామ పంచాయతీ ఆవరణలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు ముందుగా నవీన్ ను శాలువా తో సత్కరించి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం మాట్లాడుతూ రాజకీయాలలో నీతి నిజాయితీ పెరగాలంటే అవినీతి అక్రమాలు తగ్గాలంటే యువత తోనే సాధ్యమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ యువత కు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లో ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం తో పాటు కొత్త పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు,దీపావళి పండుగ సందర్భంగా అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు అవుతున్నాయన్నారు.గ్రామ శాఖ అధ్యక్షుడు నవీన్ ఓ వైపు పార్టీ బలోపేతానికి మరో వైపు ప్రభుత్వ నిధులతో గ్రామ అభివృద్ధి కి కృషి చేయాలని సూచించారు,నవీన్ ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,గ్రామస్తులు ఘనంగా సన్మానించి అభినందించిన్నారు, ఈ కార్యక్రమంలో నాయకులు బండి రాజశేఖర్,అల్లే రాజం,గొల్ల రమేష్,బండి సత్యం,ముద్దసాని హన్మాండ్లు,అల్లే రాజయ్య,గొల్ల చంద్రం ,నాగరాజు,ప్రసాద్,సురేష్,బాలరాజు,నవీన్,మల్లికార్జున్,రంజిత్,సాయి,తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


