దీపావళి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే..
నిజామాబాద్ : ఈ దీపావళి నగర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని భగవంతుడిని కోరుకున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలోని కిసాన్ ఫ్యాషన్ మాల్ లో ఘనంగా లక్ష్మీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నరకాసురుడిని వధించి విజయం సాధించిన రోజుగా పండగను నిర్వహిస్తామన్నారు. హిందూ సంప్రదాయంలో దీపావళికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక పరమార్థం, ఒక సందేశం ఉంటుందన్నారు. అలాంటి గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక పండుగ దీపావళి అని చెప్పారు. దీపావళి మనకు నేర్పేది ఒక్కటేనని.. ఎన్ని చీకట్లు ఎదురైనా ఒక చిన్న దీపం వెలుగును పంచగలదన్నారు. అదేవిధంగా సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఒక మంచి ఆలోచన, ఒక మంచి వ్యక్తి సమాజంలో మార్పు తీసుకురాగలరన్నారు. శ్రీరాముడి ఆదర్శ పాలన, శ్రీకృష్ణుడి ధర్మరక్షణ, లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ స్ఫూర్తిగా నిలవాలన్నారు. ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి కుటుంబంలో ఐశ్వర్యం, ప్రతి మనసులో సంతోషం వెల్లివిరియాలన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


