రుద్రారం నుంచి కాంగ్రెస్లోకి 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్లో చేరిక
మల్హర్ రావు : మల్హర్ రావు మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 15 మంది ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు.తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కార్యకర్తలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పొట్ట దుర్గయ్య, పొట్ట హరీష్, తాళ్లపెల్లి దుర్గయ్య, కన్నూరి కుమార్, పొట్ట రమేష్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మల్హర్ రావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, తెలంగాణ ఈజీసీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, మల్హర్ మండల మాజీ అధ్యక్షుడు బడితల రాజయ్య, మల్హర్ రావు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు, కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ, రుద్రారం సర్పంచ్ చంద్రగిరి సంపత్, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

