ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
మా ఆనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
గంభీరావుపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం గంభీరావుపేట మండల కేంద్రంలో మీ తెలంగాణ స్తూపం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్ వేర్వేరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్, మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగుతోందని అన్నారు.ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య మరియు విద్యారంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలను నెరవేరుస్తూ, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, వారు సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగ్లా రాజు గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేడ భాస్కర్ ,శివంది శ్రీనివాస్, దమ్మ గారి శ్రీనివాస్ రెడ్డి, గుర్రం రాజు గౌడ్, గోపగారి లక్ష్మీనారాయణ గౌడ్, దేశెట్టి రాజశేఖర్, గాదంశెట్టి బాల లక్ష్మి, టేకుమల్ల ప్రవీణ్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

