సనాతన ధర్మ సహస్ర సూత్రాలు హిందీ గ్రంథ ఆవిష్కరణ
భువనగిరి : రమణేశ్వరంలో ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ హిందీ గ్రంథావిష్కరణ వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని స్వీయ ఆధ్యాత్మిక అనుభూతులతో మేళవించి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి రచించిన 1,008 సంస్కృత సూత్రాలు రమణేశ్వరం, నవంబర్ 21 — సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి రచించిన ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’ గ్రంథం హిందీ అనువాదాన్ని శనివారం రమణేశ్వరంలో ఆవిష్కరించారు. ఉత్తర భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పీఠాధిపతులు, మహంతులు, యోగులు, సన్యాసులు, ఇతర రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? మానవ జీవిత లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ధర్మం చూపే మార్గం ఏమిటి? ఈ ప్రశ్నలకు సూత్రరూపంలో సమాధానాలు అందించే గ్రంథమే ‘సనాతన ధర్మ సహస్ర సూత్రాలు’. వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులలోని జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని, తమ స్వీయ ఆధ్యాత్మిక అనుభవాలు, అనుభూతులను పొందుపరుస్తూ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి 1,008 సూత్రాలను సంస్కృతంలో రచించారు. ప్రతి సూత్రానికీ తెలుగు అర్థాన్ని కూడా స్వయంగా రాశారు. తెలుగు అర్థాలతో వెలువడిన ఈ గ్రంథానికి హిందీ అనువాదం అందుబాటులోకి రావడంతో, హిందీ పాఠకులు సంస్కృత సూత్రాల భావాన్ని తమ భాషలో చదివి తెలుసుకునే అవకాశం కలిగింది అని తెలిపారు. ఈ గ్రంథావిష్కరణలో పాల్గొన్న ప్రముఖులు మహంత్ నారాయణ్ గిరి జీ ,మహారాజ్ శ్రీ స్వామి చక్రపాణి జీ, మహారాజ్ అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షులు శ్రీ మహంత్ డాక్టర్ ప్రజ్ఞా భారతి, శ్రీ బాల యోగీశ్వర్ రామ్ ఛత్తీస్గఢ్, శ్రీమత్ శ్రీ భగవాన్ వేదాంతాచార్య రసిక్, శ్రీ యోగీ డాక్టర్ జ్యోతిర్నాథ్ జీ, శ్రీ యోగిని ఓంకారనాథ్ జీ,, శ్రీ యోగిని ముక్తినాథ్ జీ, స్వామి ఓంప్రకాశానంద జీ మహారాజ్ స్వామి హర్షానంద శ్రీ అరుణానంద స్వామి జీ ,బెల్గావ్, కర్ణాటక యువ సన్యాసి ధనుంజయ్ గిరి మహామండలేశ్వర్ సంతోషానంద స్వామి జీ స్వామి సంత్, మిత్రానంద శ్రీ గోరక్ష గాడిల్కర్ షిరిడీ సీఈఓ శ్రీ పవన్ కల్యాణ్ సినీ నటుడు,కొండ రాజు క్రియేటివ్ డైరెక్టర్, తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ, వి. ప్రభాకర్ చౌదరి మాజీ ఎమ్మెల్యే, జాతీయ అధ్యక్షులు శ్రీ రాజ్ కుమార్ సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి, రాయల్ మురళ్స్ ,శ్రీ శ్రీ రమణానంద సేవా ఆశ్రమ్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు వెంకట్ తెలంగాణ న్యాయ సలహాదారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

