ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు
- పలు సేవ కార్యక్రమాలు చేపట్టిన బీసీ కమిషన్
- మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్.
తాండూరు (వికారాబాద్ జిల్లా) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్ తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ బ విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శుభప్రద్ పాటేల్ మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన పురస్కరించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు అన్నదానం కార్యక్రమం తో పాటు జూనియర్ కళాశాలలో విద్యాన అభ్యసిస్తున్న విద్యార్థులకు నోటు బక్స్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కేటీఆర్ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 111
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
