ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు

ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు

కరీంనగర్ : సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా 100 శాతం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పిలుపునిచ్చారుశుక్రవారం 33వ డివిజన్ కాన్పూరా, ప్రియదర్శిని కాలనీ మరియు 54వ డివిజన్ అశోక్‌నగర్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు, పార్టీ నాయకులతో మాట్లాడి పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాంగ్రెస్ నాయకులు సహకరించాలన్నారుఅడ్రసులు, ఫోన్ నెంబర్లు దొరకని వారికి తగిన సహాయం చేయాలని కోరారురెవెన్యూ అధికారులకు సహాయంగా అదనపు సిబ్బందిని నియమించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌ను కోరినట్లు తెలిపారు. కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారుఒక వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒక్కటి ఉంచుకోవాలని, ఎక్కడ ఉంచుకోవాలో ఓటర్లే నిర్ణయించుకోవాలనిఅందుకు నమోదు పత్రాలను అందించాల న్నారుప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనదని, నిర్లక్ష్యం వల్ల నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని బూత్ స్థాయి ప్రతినిధులకు తెలిపారు. పూర్తి చేసిన నమోదు పత్రాలను రాజేందర్‌రావు బూత్ స్థాయి అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎస్‌ఐఆర్ కమిటీ సభ్యుడు పద్మాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, 33వ డివిజన్ కార్పొరేటర్ హీనా ఆఫ్రీన్, 54వ డివిజన్ అధ్యక్షుడు తోవిటి సామ్రాట్ తదితరులు. పాల్గొన్నారు.
Views: 48

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు
సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం