చౌటకూర్‌లో కోతుల బెడద.

చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

చౌటకూర్‌లో కోతుల బెడద.

చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. కోతుల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం, చిన్నారులు, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల సంచారంతో ప్రజలు బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ఈ సమస్యను అధికారులు వెంటనే గుర్తించి, అటవీ శాఖ సహకారంతో కోతులను పట్టించి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు
సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం