సుల్తాన్పూర్‌లో ఇంటింటికీ మొక్కల పంపిణీ
చౌటకూర్ : చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం ఇంటింటికీ పండ్ల చెట్లు, పూల మొక్కలను మహిళలకు పంపిణీ చేశారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో కే. శంకర్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత కాపాడబడటంతో పాటు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి పండ్ల, పూల మొక్కలను వేప చెట్లు మరియు అన్ని రకాల చెట్ల ముక్కలను పంపిణీ చేశారు . అందించడం ద్వారా పచ్చదనాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో .ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గీతా రమేష్, ఏపీ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి పావని, ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్, ఉపసర్పంచ్ మహేష్, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


