కేటీఆర్ జన్మదినం సందర్భంగా వేములవాడలో ప్రత్యేక పూజలు, పండ్ల పంపిణీ
వేములవాడ : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కుచెల్లించి,కేటీఆర్నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదుట భక్తులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు సిరిగిరి చందు, మారం కుమార్, పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
