నీట్ లీకేజీపై కరీంనగర్‌లో విద్యాసంస్థల బంద్
- నీట్ లీకేజీపై కరీంనగర్‌లో విద్యాసంస్థల బంద్
- కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
- డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు నరేష్ యుగేందర్ డిమాండ్
కరీంనగర్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీని ఖండిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారుబీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు పెరిగిపోయాయని, దీనితో లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దోషులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారునీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ సంస్థ నుంచి తీసుకుని రాష్ట్రాలకే ఇవ్వాలని కోరారు. లీకేజీలతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంద్‌లో భాగంగా కళాశాల వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు, నాయకులను పోలీసులు అరెస్టు చేసి శిక్షణ కేంద్రానికి తరలించారు. శాంతియుత నిరసనలను అణచివేస్తే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శివ కుమార్, వంశీ, సిరి నాయక్, రాజు, ఏఐవైఎఫ్ నాయకుడు పినమల్ల భాస్కర్ తదితరులు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
