విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం
కామారెడ్డి, బాన్సువాడ : బాన్సువాడ పట్టణం లోని 3వ వార్డు రహేమానియా పాఠశాల, 4వ వార్డు అంగన్వాడీ కేంద్రం ఇస్లాంపూర లో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో విద్యార్థుల కు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం ఘనం గా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాల తో చదివి సమాజాని కి ఆదర్శంగా నిలవాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మైనారిటీ నాయకుడు ఇసాక్, రమేష్ యాదవ్, మొహమ్మద్ షఫీ,సయ్యద్ ఉబెద్, అతీఫ్, ఖాలేద్,అఫ్జల్, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.
బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 50 వ జన్మదిన వేడుకలు బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించి అంగన్వాడి విద్యార్థులకు పలకలు పండ్లు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు గుడిసెల. నరసింహులు గౌడ్, టేకుర్ల. సాయిలు, మామిడి భూమయ్య, వెంకటి, మంగలి సాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
