చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎంపీడీవో ఆనంద్.
కామారెడ్డి , బాన్సువాడ : చెట్లు నటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని శుక్రవారం మండల అభివృద్ధి అధికారి ఆనంద్ తెలిపారు. ఈ సందర్భం గా బాన్సువాడ మండల పరిధి లోని సంగోజీపేట గ్రామం లో వన మహోత్సవం లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటడం జరిగింది. అనంతరం సోమల నాయక్ తండాలో బోర్వెల్ లైన్ రీచార్జ్ ఇంకుడు గుంత మార్కోడ్ వేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో తనిఖీ చేసి సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ, పం. కార్యదర్శి మోహన్, గోపాల్, అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్.ఎం దేవిదాస్. ఉపాధ్యాయులు రమేష్ బాబు. ఆశ వర్కర్ కవిత. జిపిఓ షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


