ఎర్రగట్టుగుట్ట వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం.
హసన్ పర్తి : హన్మకొండ: హన్మకొండ అంబాల రూట్ లో ఎర్రగట్టుగుట్ట వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం ఇరువైపుల బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రపురి కాలనీ కి చెందిన విశ్రాంత బ్యాంకు అధికారి సుధాకర్ రావు , కాలనీ వాసి సదానందం ఇరువురు ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ ఆర్. ఎం. (ఓ) దేవులపల్లి. శ్రీహర్షను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాంతంలో నిత్యం వివిధ కాలేజీల విద్యార్థులు , వివిధ గ్రామాల ప్రజలు , ప్రయాణికులు ప్రయాణిస్తారని దీంతో ప్రతిరోజూ రద్దీగా ఉంటుందని ప్రయాణికులు వేచి ఉండటానికి సరైన ప్రదేశం లేక అవస్థలు పడుతున్నారు అని వెంటనే బస్ షెల్టర్లు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని వినతిపత్రం లో కోరారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
