ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం

ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం

కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి పనిచేస్తోందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్‌లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో 25వ డివిజన్ సుభాష్‌నగర్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సిమెంటు రోడ్డునిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 12వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీలో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సిమెంటు రోడ్డు మరియు తాగునీటి గొట్టాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా సిమెంటు కాలువల నిర్మాణం, ప్రజలు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేలా నాణ్యమైన సిమెంటు రోడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి తాగునీరు అందేలా గొట్టాల వ్యవస్థను బలోపేతం చేయడం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారుప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అనుగుణంగా కరీంనగర్ నగరంలోనూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నగర అభివృద్ధిలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, చేపట్టిన పనులను సంరక్షిస్తూ పరిశుభ్రమైన పరిసరాలను కాపాడాలని పిలుపునిచ్చారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నిర్ణీత గడువులో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మేయర్ ఆదేశించారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు కూడా దశలవారీగా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, 25వ డివిజన్ కార్పొరేటర్ గంట శ్రీనివాస్, 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, మున్సిపల్ అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు
సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం