మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పరామర్శ
మంగపేట : మండలంలో నర్సాయిగూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాద్యాయుడు మడే భిక్షపతి తల్లి మడే ముత్తమ్మ అనారోగ్యంతో మృతి చెందాగా గురువారం దశదిన ఖర్మలకు కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు మైల జయరాంరెడ్డి అధ్యర్యంలో మడే ముత్తమ్మ కుటుంబాన్ని పరమర్శించి ఓదార్చి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ముత్తమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని పార్దించారు. అలాగే కోమటిపెల్లి గ్రామానికి చెందిన మద్దిరాల సత్యం తొండ్యాల గ్రామానికి చెందిన పోదేం వెంకటేశ్వర్లు అనారోగ్యం వలన మృతి చెందాగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యర్యంలో మృతుల కుటుంబాలను పరమర్శించి ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి ఆక రాధాకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యాణయ్య కారుపోతుల నర్సయ్య దామెర సారయ్య పగిడిపెల్లి వెంకటేశ్వర్లు కొమురం బాలయ్య ఎడ్ల నరేష్ మార్పుల దయాకర్ రెడ్డి కుర్సం రమేష్ పోడెం నగేష్ జంగం బానుచందర్ నాగేల్లి పరుశురాం పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


