కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
వేములవాడ,రాజన్న : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రధాన ద్వారం వద్ద మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ న్యాయవాదులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుడిసె సదానందం మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కేటీఆర్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నడిగోట్ల హరికృష్ణ, నాగరాజు, సుంకపాక నవీన్, బొడ్డు గంగరాజు, పొత్తూరు జనార్దన్, మల్లేష్, అజయ్, బూర సరిత, నాగరాజు తదితర బీఆర్ఎస్ న్యాయవాదులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


