బీజేపీ గుండాల్లారా ఖబర్దార్
కరీంనగర్ : కాంగ్రెస్ నాయకుల జోలికొస్తే ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు బీజేపీ నాయకులను హెచ్చరించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా, ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం నగరంలోని 3వ డివిజన్ తీగలగుట్టపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.ఈ సందర్భంగా రాజేందర్‌రావు మాట్లాడుతూ బీజేపీ గుండాల్లారా ఖబర్దార్. మా ఓపికను అలుసుగా తీసుకుంటే వీధుల్లో తిరగలేరు. తస్మాత్ జాగ్రత్తఅన్నారుశాంతియుతంగా నిరసనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై బండి సంజయ్ అనుచరులు లాఠీలతో దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఇకపై ఇలాంటి దౌర్జన్యాలను సహించబోమని స్పష్టం చేశారు.నీట్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసేదాకా పోరాటం ఆపేది లేదన్నారు.ప్రధాని నరేంద్ర మోడీకి ఇక శంకర్‌గిరి మాన్యాలు తప్పవని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి గ్రామం, ప్రతి వీధిలో ఎండగడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, 3వ డివిజన్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి, పద్మాకర్ రెడ్డి, ఆర్ష మల్లేశం, కాశెట్టి శ్రీనివాస్, ఎలగందుల సర్పంచ్ నిమ్మల అంజన్న తదితరులు పాల్గొన్నారు
Views: 39
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
