ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ అమానుషం

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీ అమానుషం

మంగపేట  : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా మంగపేట మండల కేంద్రంలో భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టి ఎ)ను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా *ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కోగిల బాలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ముసుగులో ఉన్న కనీసం పేరు బాడ్జీలు లేని దుండగులు లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి చెట్టిపల్లి చందు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో వరుసగా చోటుచేసుకుంటున్న అవకతవకలు పారదర్శకత లోపాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని అన్నారు. అందుకే ఎన్ టి ఎ ను రద్దు చేసి నమ్మకమైన పారదర్శకమైన పరీక్షా విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ అణచివేత చర్యలకు పాల్పడటం మానుకోవాలని విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు దిలీప్ రాజు మండల సహాయ కార్యదర్శి రాజు చరణ్ నవ్య భవ్య శ్రీ నరేష్ అభినవ్ 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు
సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం