కేటీఆర్ జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలు.

కేటీఆర్ జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలు.

కొత్తగూడెం,: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను శుక్రవారం కొత్తగూడెంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రామవరం పట్టణ కేంద్రంలో మొక్కలు నాటి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హేమచంద్రపురంలోని "అమ్మ" అనాథ శరణాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. శరణాలయంలోని చిన్నారులు, నిర్వాసితులకు అన్నదానం నిర్వహించి స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజా స్వరంగా కేటీఆర్ నిలుస్తున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలకు ధైర్యం, దిశానిర్దేశం చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండి తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిష్ సునీత, మాదాసు పద్మ, పాషా, లచ్చిరాం, షరీఫ్, మనోజ్, పూర్ణ, జగడం కిరణ్, ముద్దంగుల మహేష్, చింతకుంట్ల కేశవ్, జున్నూరు రాజేష్, భరత్, సచిన్, సమీర్, సోహెబ్, షణ్ముఖ సాయి, అమన్, వేణు, ఆసిఫ్, నరేష్, యశ్వంత్, నందిగామ కిరణ్, మహమ్మద్ పాషా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, "అమ్మ" అనాథ శరణాలయ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
Views: 88

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు
సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం