కొర్పోల్‌లో తొలిసారిగా జగన్నాథ రథయాత్ర

భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహణ

కొర్పోల్‌లో తొలిసారిగా జగన్నాథ రథయాత్ర

చౌటకూర్ : మండలంలోని కొర్పోల్ గ్రామంలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో తొలిసారిగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను గురువారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ ఆధ్యాత్మిక వేడుకకు గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రథయాత్రను విజయవంతం చేశారు.గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, అక్కడి నుంచి రామ్ మందిరం వరకు వైభవంగా కొనసాగింది. పూలతో సుందరంగా అలంకరించిన రథంపై కొలువుదీరిన శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.రథాన్ని భక్తులు భక్తిపూర్వకంగా లాగుతూ హరినామ సంకీర్తనలు, భజనలు, జై జగన్నాథ నినాదాలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన ఈ రథయాత్ర భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు
సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం