ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్.

ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్.

ఆదిలాబాద్ బ్యూరో  : ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలోఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి ఆధ్వర్యంలో నిర్వహించిన యువత నాయకత్వ అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువత ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, సమాజంలో చైతన్యం తీసుకువచ్చేలా ముందుండాలని సూచించారు. యువత కేవలం విద్యకే పరిమితం కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, సామాజిక బాధ్యతతో సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థ, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడం అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ తెలిపారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్మూర్​లో ఏటీఎం చోరీకి యత్నం ఆర్మూర్​లో ఏటీఎం చోరీకి యత్నం
నిజామాబాద్ :  ఆర్మూర్​ పట్టణంలో ఏటీఎం చోరీకి దొంగలు యత్నించారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి రాత్రివేళ...
టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా సయ్యద్ సాదిక్ నియామకం
ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు
తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు
ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్.