ఓటర్ల జాబితా పునర్విమర్శ ప్రక్రియను విజయవంతం చేయాలి
బోనకల్,:బోనకల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర పునర్విమర్శ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. బోనకల్‌లోని వీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ స్థాయి ప్రతినిధులు (బీఎల్‌ఏలు)తో సమావేశమై కార్యక్రమం పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్ల జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలని, అర్హుల పేర్లు నమోదు చేయడం, అనర్హుల వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించడం అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.ఓటర్ల జాబితా సక్రమంగా ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత విశ్వసనీయంగా సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించాలని సూచించారు. ప్రజలు కూడా ఈ ప్రత్యేక పునర్విమర్శ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను సరిచూసుకొని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ప్రత్యేక పునర్విమర్శ కార్యక్రమంలో అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.అనంతరం బోనకల్ మండల మాజీ జెడ్పిటిసి బానోతు కొండ మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని, అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఓటర్ల జాబితాను మరింత పకడ్బందీగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంత మవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బోనకల్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పారా ప్రసాద్, నాగేశ్వరావు, బంధం నాగేశ్వరావు, ఇటుకల శ్రీను, వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


