రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
నల్లబెల్లి,(వరంగల్ జిల్లా): మండలంలోని గుండ్లపహాడ్ గ్రామపంచాయతీ పరిధిలో గల రుద్రమ గ్రామైక్య సంఘంలో ఉన్నటువంటి 35 సంఘాలలో గత 3 ఏండ్లలో.35 లక్షలు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సోమవారం ఆ సంఘ సభ్యులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతూ ఏపీఎం సుధాకర్ కి, తహసిల్దార్ ముప్పు కృష్ణకు ,ఎస్సై సాయి ప్రసన్న కుమార్ కి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గుండ్లపహాడ్ ఉమ్మడి గ్రామపంచాయతీ ఉన్నప్పటినుండి గ్రామైక్య సంఘం సిఏగా ఉన్నటువంటి కొలువుల సతీష్ బాధ్యతారహితంగా వ్యవహరించినట్లు ఆరోపించారు . గతంలో అన్ని సంఘాలకు సంబంధించిన లెక్కలు ఎప్పుడు అడిగినా కాలయాపన చేస్తున్నాడని తెలిపారు.సంఘం లెక్కలు అడుగుతుంటే మాట దాటేస్తున్నాడని అన్నారు.గత నెల సీఏ సతీష్ ను ఒత్తిడి చేయడంతో ఈనెల 15వ తేదీన లెక్కలు అప్ప చెప్తానని హామీ ఇచ్చి. రోజులు గడుస్తున్నా సమావేశాలు రావడం లేదని ఆరోపించారు. కావున విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత, అధ్యక్షురాలు కూస లావణ్య,కోశాధికారి సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
