ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తపస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
ఝరాసంగం : ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆగస్టు 1న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఝరాసంగం మండలం కుప్పానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో మంగళవారం భోజన విరామ సమయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, మహాధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి, జిల్లా కోశాధికారి తుక్కప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ, లక్ష్మి, జిల్లా బాధ్యులు కృష్ణ, సురేష్, ఉపాధ్యాయులు శ్రీరామ్, శ్రీనివాస్, ఆంజనేయులు, సంగమేశ్వర్ రెడ్డి, బాల్ శెట్టి, హరినాథ్ రెడ్డి, సంగీత, శ్రీదేవి, మాధురి, శ్రీకన్య, స్వర్ణలత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
