ఘనంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు

ఘనంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు

హసన్‌పర్తి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలను వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్‌పర్తిలో గల మహాలక్ష్మి బ్యాంకెట్ హాల్‌లో కాంగ్రెస్ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు మరియు హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రామ్ నర్సింహా రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు కేక్ కట్ చేసి, ఖర్గే కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  అనంతరం, సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గొడుగులను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం