ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వెలుగులు నింపాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్
- మెదక్ : దీపావళి పండుగను పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమాన్ని మెదక్ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పరిధిలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లి వారితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి, వారి కుటుంబాలతో ఆనందాన్ని పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. కావున జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా మరియు మండల కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంజనేయులు గౌడ్ విజ్ఞప్తి చేశారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
07 Nov 2026 18:30:54
కొత్తగూడెం బ్యూరో : డిజిటల్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని కొత్తగూడెం సబ్ ఇన్‌స్పెక్టర్ జుబేదా...
