బ‌తుక‌మ్మ వేడుక‌ల‌లో పాల్గొన్న కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తులు

బ‌తుక‌మ్మ వేడుక‌ల‌లో పాల్గొన్న కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తులు

ఆదిలాబాద్ :తెలంగాణ సంస్కృతీ సాంప్ర‌దాయాల‌కు బతుక‌మ్మ వేడుక‌లు అద్దం ప‌డ‌తాయ‌ని 
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి  ఆయ‌న సతీమణి కంది మౌన శ్రీనివాస రెడ్డి అన్నారు.  జిల్లాలో బ‌తుక‌మ్మ సంబ‌రాల‌ను పురస్క‌రించుకొని జైన‌థ్ మండ‌ల కేంద్రంలో ప‌లు చోట్ల నిర్వ‌హించిన బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. స్థానికులు పార్టీ శ్రేణులు వారికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం స్థానిక మ‌హిళ‌లు యువ‌తులు పిల్ల‌ల‌తో క‌లిసి బ‌తుక‌మ్మల చుట్టూ  ఉత్సాహంగా నృత్యాలు చేసారు.పూల‌ను ప్ర‌కృతిని ఆరాధించ‌డం తెలంగాణ గొప్ప సాంప్రదాయ‌మ‌ని అన్నారు. ప్ర‌తీ సంవ‌త్సరం ఇలాగే సంబ‌రాల‌ను వైభ‌వంగా నిర్వ‌హించుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఈకార్య‌క్ర‌మంలో నాయ‌కులు రంగినేని శాంత‌న్ రావు,కొండ గంగాధ‌ర్ , ద‌ర్శ‌నాల అశోక్, విఠ‌ల్ రెడ్డి , త‌మ్మ‌ల చందు, కేతిరెడ్డి సురేంద‌ర్ రెడ్డి, మ‌హ‌మూద్ ,క్యాతం శివ‌ప్ర‌సాద్ రెడ్డి,  జైన‌థ్ మండ‌ల నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!