పంజుగుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యాబోధన, హాజరు, మధ్యాహ్న భోజనంపై ఆరా మౌలిక వసతులను వెంటనే మెరుగుపరచాలని ఆదేశం

పంజుగుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నాగర్‌కర్నూల్ : కల్వకుర్తి మండలం పంజుగుల ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల విధుల నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మొత్తం 43 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సంప్రదింపులు జరపాలని అన్నారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే అవసరానికి అనుగుణంగా అదనపు ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన అందించాలని సూచించారు. మౌలిక వసతుల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆహార నాణ్యత, వంటశాల పరిశుభ్రతను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల మెరుగుదలకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు.తనిఖీలో కలెక్టర్ వెంట తహసీల్దార్ ఇబ్రహీం, ఎంపీడీవో యాదయ్య, ఎంఈఓ శంకర్ నాయక్, సర్పంచ్ పర్వతాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News