అధికారుల ఒత్తిళ్లు తాళలేం... విధులు నిర్వహించలేం!

మర్రిగూడలో 16 మంది పంచాయతీ కార్యదర్శుల ముకుమ్మడి సెలవు

అధికారుల ఒత్తిళ్లు తాళలేం... విధులు నిర్వహించలేం!

ఎంపీడీఓ మునయ్యకు వినతిపత్రం అందజేత

న్యాయం జరిగే వరకు విధుల్లో చేరే ప్రసక్తిలేదు 

నల్గొండ/మర్రిగూడ : ఉన్నతాధికారుల తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, అనుచిత వేధింపులను నిరసిస్తూ నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన బాటపట్టారు. మండలంలోని మొత్తం 16 మంది కార్యదర్శులు ఒక్కసారిగా ముకుమ్మడిగా సెలవులో వెళ్లాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జి.సి.మునయ్యను కలసి తమ ముకుమ్మడి సెలవు అభ్యర్థన వినతిపత్రాన్ని అందజేశారు.

నిత్యం మానసిక నరకం... భరించలేకే ఈ నిర్ణయం

మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వంశీ మాట్లాడుతూ కార్యదర్శుల ఆవేదనను వెళ్లగక్కారు. నిత్యం విధి నిర్వహణలో క్షేత్రస్థాయి సమస్యలతో పాటు ఉన్నతాధికారుల నుంచి ఎదురవుతున్న తీవ్ర మానసిక ఒత్తిళ్లు, వేధింపులతో సతమతమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సమయంతో నిమిత్తం లేకుండా అప్పగించే అదనపు బాధ్యతలు, సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా లక్ష్యాలను నిర్దేశించడం, పై అధికారుల వేధింపులతో మానసిక ప్రశాంతత కరువైందని వాపోయారు. రోజురోజుకూ ఈ ఒత్తిడి భరించరాని స్థాయికి చేరడంతోనే వేరే దారి లేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో స్తంభించిన పాలన. ఒకేసారి మండలంలోని 16 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు విధులను బహిష్కరించి ముకుమ్మడి సెలవు పెట్టడంతో గ్రామాల్లో పంచాయతీ పాలన తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, జనన-మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల వసూలు వంటి నిత్యావసర సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.

సమస్యలు తీరే వరకు వెనక్కి తగ్గేదే లేదు! తాము ఎదుర్కొంటున్న వేధింపులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సేకరించాలని, తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి తగిన న్యాయం చేయాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తిరిగి విధుల్లోకి చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల పరిధిలోని 16 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అందరూ పాల్గొని సంఘీభావం తెలిపారు.కాగా, మండల కార్యదర్శుల ముకుమ్మడి సెలవు నిర్ణయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో, గ్రామాల్లో ప్రత్యమ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన చౌటకూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కథక్ నృత్య ప్రదర్శన
చౌటకూర్ : విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ‘స్పిక్ మెకే’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ జిల్లా పరిషత్...
అల్లాదుర్గంలో ట్రాన్స్ఫార్మ్ ను కప్పేసిన తీగలు
దీపావళి బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి
విద్యార్థుల పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం.
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
మున్సిపల్ అధికారులకు జీహెచ్ఎంసీ–ఏఎస్సీఐ ఆధ్వర్యంలో సామర్థ్య అభివృద్ధి కార్యక్రమం