ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష
నిజామాబాద్ : నిజామాబాద్ వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ధర్నా కార్యక్రమo విరమించి విధులకు హాజరవుతున్నందున పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు . మాతా శిశు ఆరోగ్యము మరియు పోషకాహారం పై మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీల పరీక్షలు ,గర్భిణీ స్త్రీల నమోదు, పరీక్షల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ శస్త్ర చికిత్సలను తగ్గించే సాధారణ ప్రసవాలను పెంచాలన్నారు. సెకండరీ మరియు
టెరీషియరీ ఆసుపత్రులతో సమన్వయం కలిగి ఉండి సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరూ ప్రణాళికతో ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలన్నారు. ఆరోగ్య మహిళ ద్వారా 18 సంవత్సరాల నిండిన మహిళలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే అవసరమైన వారిని రిఫర్ చేయాలన్నారు.అదే విధంగా మాతా శిశు మరణాలను తగ్గించాలన్నారు. పి సి పి ఎన్ డి టి యాక్ట్ ప్రకారం అన్ని ఆసుపత్రుల్లో ఫారం ఎఫ్ ఆడిట్ నిర్వహించాలని, స్త్రీ పురుష నిష్పత్తి తగ్గకుండ చర్యలు తీసుకోవాలని అన్నారు . ప్రతి మంగళ వారం సమీక్షలో గతవారం కంటే ఎక్కువ ఫలితాలు సాధించాలన్నారు. హెచ్ పి వి వాక్సినేషన్ కోసం పాఠశాలల వారీగా అర్హులైన బాలికల జాబితాను సిద్ధం చేసి ప్రతిరోజు ఒక పాఠశాలని సందర్శించి హెచ్ పి వి టీకాలను ఈ నెల చివరి వరకు 100% సాధించాలన్నారు. పోషకార లోపంతో బాధపడే పిల్లలందరినీ ఎన్ఆర్సి లో చికిత్స అందించాలన్నారు. రాష్ట్రీయ కిశోర సురక్ష కార్యక్రమంలో భాగంగా కిషోర బాలికలందరినీ నమోదు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి చికిత్స అందించాలన్నారు. తమ తోటి బాలికల చేత కౌన్సిలింగ్ చేయించాలని అన్నారు. గిరిజనుల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడా లన్నారు. జీవనశైలి వ్యాధుల గుర్తింపు, పరీక్షల నిర్వహణ, చికిత్స అందించడం, అవసరమైన వారిని ఉన్నత ఆసుపత్రులకు చికిత్స కోసం పంపించడం లాంటివి చేయాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలోని క్యాన్సర్ కేసులన్నింటిని గుర్తించి ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. పిహెచ్సిలా వారిగా కంటి పరీక్షలు మరియు క్యాటరాక్ట్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించి ప్రజల కంటి ఆరోగ్యం కాపాడాలన్నరు .డెంగీ వ్యాధిగ్రస్తులను పాజిటివ్ గా గుర్తించిన వెంటనే యాక్షన్ టేకెన్ చేయాలన్నారు. ఆర్ డి టి మరియు టీ హబ్ ల్యాబ్ పరీక్షలు కాకుండా అనుమానిత జ్వరం వచ్చిన వ్యక్తుల వద్ద నుండి వైద్య సిబ్బంది రక్తపూత నమూనాలను సేకరించాలన్నారు. ప్రస్తుతం మనకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని మొదటి ప్రాధాన్యతగా టిబి ఎంబీఏను రెండవ ప్రాధాన్యతగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి రాకుండా హెచ్ పి వి టీకాలను ఇవ్వాలన్నారు. డిసెంబర్ నెల చివరి కన్నా 14 సంవత్సరాల బాలికలు అందరికీ హెచ్‌పీవీ టీకాను ఇవ్వాలన్నారు. స్వచ్ఛంద సంస్థలే కాకుండా బిల్డర్స్, పారిశ్రామికవేత్తలు, రైస్ మిల్లర్స్, రెడ్ క్రాస్ సభ్యులు, ఫార్మా కంపెనీ యజమానుల ద్వారా పోషకాహార కిట్టులను క్షయవ్యాధిగ్రస్తులకు అందించాలని అన్నారు. క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు పకడ్బందీగా నిర్వహించి నూతన క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించాలన్నారు. ఎండిఆర్ తీవ్రతను తగ్గించి చికిత్స అందించాలన్నారు. ఎన్ హెచ్ ఎం సిబ్బంది ధర్నా వల్ల తప్పిపోయిన జనని సెషన్లను పూర్తి చేయుటకు ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాల కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. వ్యాక్సిన్ ల ద్వారా వ్యాధులను నియంత్రించే విపిడి ద్వారా శాంపుల్స్ సేకరణ చేసి ఐపిఎం నకు 72 గంటల్లో పంపాలి అన్నారు. టీకాల నమోదును 24 గంటల్లో ఆన్లైన్లో నమోదు చేయాలి అన్నారు. వైద్యాధికారులందరూ అంబులెన్స్‌లను వారి కోఆర్డినేటర్లను ప్రతినెల సమీక్షించాలని, 102 అమ్మఒడి వాహనం ద్వారా గర్భిణీలను తరలించే రోజువారి సంఖ్యను పెంచాలన్నారు. నీ ప్రైవేట్ ఆస్పత్రుల నుండి హెచ్ఎమ్ఐ ఎస్ నివేదికలను పంపాలని అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్లలో రోగుల సంఖ్యను పెంచాలన్నారు. 14416 అనే టెలి మానస్ టోల్ ఫ్రీ నంబర్ పై అందరికీ తెలిసేలా పాఠశాలలో, కాలేజీలు, కమ్యూనిటీలో అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.ఈ ఆరోగ్యం, ఈ సంజీవని ద్వారా వైద్య సేవలను విస్తృతంగా పెంచాలన్నారు. ప్రతివారం నిర్వహించే సమీక్ష సమావేశాల నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించి వారి సహాయ సహకారాలతో కార్యక్రమాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ బి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు ప్రణాళికను తయారుచేసి, ఇతర శాఖ ల సమన్వయంతో వ్యాధులను అరికట్టాలన్నారు. కేలో ఇండియా క్రీడల నిర్వహణ సమయంలో ఆరోగ్య సేవలను అందించి ఇటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు . ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మాట్లాడుతూ జిల్లా ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, పిహెచ్సి వైద్యాధికారులు వారి వారి పరిధిలో లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి పాఠశాలను సందర్శించే హెచ్‌పీవీ టీకాలను 100% ఇవ్వాలని, క్షయ ముక్త భారత ఆబియాన్లో భాగంగా క్షయవ్యాదిగ్రస్తులకు పోషకాహార కిట్టులను స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పించాలన్నారు. మీ ప్రమాణంలో హాజరు నమోదు చేయాలన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారిని డాక్టర్ దేవి నాగేశ్వరి ,జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ సికందర్ నాయక్ ,డాక్టర్ రవీందర్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అశోక్, డాక్టర్ అంజన్ ,డాక్టర్ వెంకన్న డాక్టర్ సుప్రియ ,డాక్టర్ వెంకటేష్, డాక్టర్ అజ్మల్,డాక్టర్ శిఖర, డాక్టర్ నవ్య, డాక్టర్ సుజాత, డాక్టర్ శ్రావ్య,ఎస్ ఓ రాజేశ్వర్, డిప్యూటీ డెమోదుర్గారావు,ఫార్మసీ అధికారి నారాయణ, డి హెచ్ ఈ మనోహర్, డిపిఓ విశాల , సచిన్, తరుణ్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


