గోవు విజ్ఞాన పరీక్షలో భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ
రాష్ట్రస్థాయి పరీక్షలో నగదు బహుమతి సాధించిన 8వ తరగతి విద్యార్థిని బి. జశ్వి
కొత్తగూడెం : గోవు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో గోసేవా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన గోవు విజ్ఞాన పరీక్ష–2026 (Gow Vignana Pareeksha 2026) రాష్ట్రస్థాయి పోటీల్లో రామవరం భారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
ఈ పరీక్షలో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా 8వ తరగతికి చెందిన బి. జశ్వి నగదు బహుమతిని గెలుచుకుని పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. రాష్ట్రస్థాయి పరీక్షలో ప్రతిభ చాటిన జశ్విని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యోగా గురువు సత్యనారాయణ, గోవు విజ్ఞాన పరీక్ష కన్వీనర్ ఎన్. స్వామి, ఎస్.ఆర్. పాఠశాలల జోనల్ హెడ్ వై. సతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్. నరేష్ పాల్గొన్నారు. వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, గోమాత ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి విజ్ఞాన పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని మరింత ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.
విద్యార్థిని జశ్విని అభినందిస్తూ, ఈ పరీక్ష నిర్వహించిన గోసేవా విభాగం నిర్వాహకులకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


