సీఎం దూరదృష్టితోనే రైతులకు రికార్డుస్థాయి ధర
నిజామాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నేడు రైతులకు పండించిన ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర లభిస్తోందని రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి అన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ అర్గుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఎనిమిది రకాల వరిధాన్యం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపుతో రైతులకు ఎనిమిది రకాల వరి ధాన్యాన్ని సాగు చేయాలని సూచించారని భూపతిరెడ్డి తెలిపారు. ఆ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఆయా రకాల ధాన్యానికి మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర లభిస్తోందని తెలిపారు. ఆనాడు ప్రతిపక్షాలు చేసిన విమర్శలు, ఆరోపణలు అర్థరహితమని నేటి ఫలితాలు నిరూపిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ ధాన్యానికి రూ.2,461 మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ అందిస్తోందని, తద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని పేర్కొన్నారు.
రైతులు తొందరపడి తక్కువ ధరకు ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించవద్దని, క్వింటాల్‌కు రూ.3,000 కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అర్గుల్ పీఏసీఎస్ ఛైర్మన్ గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజయ్ రెడ్డి, నాయకులు సాయిరెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి,రాజన్న, ఆయా గ్రామాల నాయకులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


