* ఆదిలాబాద్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి రూ.5 లక్షలు మంజూరు*జిల్లా కలెక్టర్ రాజర్షి షా
భూమిపూజ చేసి పనులు ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ బ్యూరో : జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవ తీసుకొని రూ.5 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో ప్రహరీ గోడ, ఫ్లోరింగ్, మరుగుదొడ్ల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం ప్రెస్ క్లబ్ ఆవరణలో కలెక్టర్ రాజర్షి షా భూమిపూజ నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాత్రికేయుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

