108లో పైలట్,ఈఎంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూ లు -ఈఎంటి కి 20వేయిలు, పైలట్ కు 10వేయిలు డిపాజిట్ చేయాలని మెలిక
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు 108 జీవీకె ఈఎంఆర్ఐ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పైలట్, ఈఎంటి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తిన్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ తెలిపారు.ఈఎంటి ఉద్యోగానికి బిఎస్సి సైన్స్,బిఎస్సీ నర్సింగ్, వంటి అర్హతలు కలిగి ఉండాలని పైలట్ కు 10వ తరగతి చదివి హెవీ లైసెన్స్, బ్యాచ్ డ్రైవింగ్ లో అనుభవం ఉండాలని అన్నారు.ఈఎంటి ఉద్యోగానికి అభ్యర్థులు 20వేయిలు, పైలట్ ఉద్యోగానికి 10వేయిలు ఫిక్స్ డ్ డిపాసిట్ చేయాలని,హైదరాబాద్ లో ఉండే ట్రైనింగ్ కు అభ్యర్థులు ప్రయివేట్ హాస్టల్ లో ఎక్కడైనా ఉంది ట్రైనింగ్ కు అటెండ్ కావాలని సంస్థ ఎలాంటి వసతి సౌకర్యం కల్పించదని సొంత ఖర్చులతోనే ట్రైనింగ్ కు అభ్యర్థులు హాజరు కావాలని సామ్రాట్, ఈఎంఈ నరేష్ తెలిపారు.జిల్లా నలుమూలాల నుండి ఇంటర్వ్యూ కు హాజరైన పలు అభ్యర్థులు మేము నిరుద్యోగులము డబ్బులు కట్టి ఉద్యోగంలో చేరాలంటే మా వద్ద డబ్బులు లేవు అని పలు అభ్యర్థులు ఇంటర్వ్యూ కు హాజరు కాకుండానె వెనుదిరిగారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


