సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ

వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులకు పెన్షన్ పత్రాలు అందజేసిన ఎంపీడీవో శంకర్, గ్రామ ప్రజాప్రతినిధులు

సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ


చౌటకూర్ :  సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని సుల్తాన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులకు పెన్షన్ పత్రాలను ఎంపీడీవో శంకర్, గ్రామ సర్పంచ్ చంటి, గీతారాణి, రమేష్ తదితరులు అందజేశారు.ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు అర్హులైన పేదలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారికి, భర్తను కోల్పోయిన మహిళలకు, దివ్యాంగులకు పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మహేష్ యాదవ్, చౌటకూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పావని గౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ