దళితులపై దాడులు అరికట్టాలి.
_SC, ST అట్రాసిటీ కెలుసులైన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలి.
_ నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయం లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేత. మెదక్ : మెదక్ జిల్లాలో బోనాలు, బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్బంగా దళితులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలని, కులవివక్షత పాటించిన వారిపై చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటి నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ అనితకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా జాతీయ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ, కేవీపీస్ జిల్లా నాయకులు కడారి నాగరాజు, TMRPS నియోజకవర్గ కన్వీనర్ కుమార్, JMM రాష్ట్ర నాయకులు ఊరట్ల శివ, JMM మండల అధ్యక్షులు గోవు యాదగిరి మాట్లాడుతూ
జిల్లాలోని మనోహరాబాద్ మండలం కోనాయపల్లి, శివ్వంపేట మండలం నవాబ్ పేట్ గ్రామల్లో బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా దాడి చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. కుచారం గ్రామంలో దళిత మహిళా సర్పంచ్ ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనకుండా కుల వివక్షత పాటించి అవమానించారనీ, తుప్రాన్ మండలం వెంకటయపల్లి గ్రామంలో బోనాల సందర్బంగా గుడికి దళితులు వెళ్లే దారిని ముసి వేసి అనగరికంగా వ్యవహారించారాని మండిపడరు. వెల్దుర్తి మండలం ఎదులపల్లి గ్రామంలో దళిత మహిళా సర్పంచ్ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటే అడ్డుకుని అడనివ్వలేదు. తుప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో దళిత మహిళలు బతుకమ్మ ఆడినందుకు సాంఘిక బహిష్కరణ చేశారు. హవెలి ఘనపూర్ మండలాల్లో దళితులపై దాడి జరిగింది. పై ఘటనల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయినా నేటికీ విచారణ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో JMM జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్, MSF జిల్లా ఇంచార్జ్ నాగరాజు, MRPS సీనియర్ నాయకులు మన్నే భిక్షపతి, నరేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


