వ్యవసాయ యంత్ర పరికరాలపై 40 శాతం సబ్సిడీ
మెదక్, : నర్సాపూర్ మండలంలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు వ్యవసాయ యంత్ర పరికరాలపై ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకం ద్వారా ట్రాక్టర్, వరికోత యంత్రం, డ్రోన్, కల్టివేటర్, రోటవేటర్, గడ్డి కట్టే యంత్రం, MB ప్లౌ, స్ప్రేయింగ్ యంత్రాలు, పవర్ టిల్లర్, పవర్ వీడర్, బ్రష్ కట్టర్, ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయర్ తదితర మొత్తం 37 రకాల వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ పొందవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం
ఈ సబ్సిడీ ప్రయోజనాన్ని పొందేందుకు క్రింది సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
1. PACS – ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.
2. FPO – రైతు ఉత్పత్తిదారుల సంస్థలు.
3. SHG – స్వయం సహాయక సంఘాలు.
ముఖ్య గమనిక: వ్యక్తిగత రైతులు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.
పై పేర్కొన్న PACS, FPO, SHG సంస్థలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యంత్రాలు అద్దెకు ఇచ్చి, సంఘాలు అభివృధి చెంది,వ్యవసాయ యాంత్రీకరణను పెంపొందించుకోవాలని కోరడమైనది. పూర్తి వివరాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయం నర్సాపూర్ నందు సంప్రదించగలరు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


