చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపిన హాస్పటల్ కార్మికులు:.....
బాన్సువాడ : బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు పెంచాలని మంగళవారం నాడు కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతి లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు మాట్లాడుతూ. కార్మికుల కు కనీస వేతనం 26 వేల రూపాయల కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల కు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతినెల 1వ తేదీన కార్మికుల ఖాతాకు జీతాలు జమ చేయాలని, పండుగ జాతీయ సెలవులు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమం లో జైల్ సింగ్, సురేఖ, రాజ్ కుమార్, రాకేష్, అనురాధ, సంతోష్, రామ్ చరణ్, నరేందర్, సరిత, కళ్యాణి, శంకర్, సంగీత, నజియా, సాయిబాబా, డి సాయిలు, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


