వృద్ధురాలి అంత్యక్రియలకు ప్రజాప్రతినిధుల ఆర్థిక సాయం
సాలూర: సాలూర మండలానికి చెందిన చాకలి సావిత్రి అనే వృద్ధురాలు మృతి చెందడంతో ఆ పేద కుటుంబం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు మానవత్వంతో ముందుకొచ్చారు. సర్పంచ్ భర్త రవి రూ.5 వేలు, ఉపసర్పంచ్ బుయన్ సురేష్ పటేల్ రూ.2 వేలు ఆర్థిక సాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు. మూడో వార్డు సభ్యుడి భర్త రాజు సైతం కాలనీవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తనవంతు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా గ్రామ యువకులు, పెద్దలు కూడా మానవత్వాన్ని చాటుకున్నారు. స్కానర్ల ద్వారా విరాళాలు సేకరించి తమకు తోచినంత ఆర్థిక సాయం అందిస్తూ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచారు. కష్టకాలంలో స్పందించి ఆ కుటుంబానికి బాసటగా నిలిచిన ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, పెద్దల సేవాభావాన్ని పలువురు అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


