పేరుకే ధరల బోర్డులు.. బియ్యం లేవంటూ చేతులెత్తేస్తున్న వ్యాపారులు
* బెల్లంపల్లిలో ‘జై శ్రీ రామ్’ బియ్యం కృత్రిమ కొరత * అధికారుల ముందు ఫోటోలకు పోజులు.. ఆపై నిల్వలు లేవంటూ సాకులు * తక్షణమే తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని ఏం సిపిఐ యు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్
ఈ రోజు బెల్లంపల్లి లోని ఏం సిపిఐ యు పార్టీ కార్యాలయం లో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ
సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ప్రభుత్వ ఆశయానికి బెల్లంపల్లి పట్టణంలోని కొందరు బియ్యం వ్యాపారులు తూట్లు పొడుస్తున్నారని అధికారుల కళ్లుగప్పి కృత్రిమ కొరత సృష్టిస్తూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకుగురిచేస్తున్నారని
ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు బియ్యం దుకాణాల యజమానులు తమ షాపుల ముందు ‘ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించబడును’ అంటూ పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఆ బోర్డుల ముందు నిలబడి ఫోటోలకు పోజులిస్తూ నిబంధనలు పాటిస్తున్నట్లు నటిస్తున్నారు. అయితే, వినియోగదారులు బియ్యం కొనుగోలు చేయడానికి దుకాణాలకు వెళ్లినప్పుడు అసలు విషయం బయటపడుతోందని ప్రజలు ఎక్కువగా వినియోగించే ‘జై శ్రీ రామ్’ (JSR) రకం బియ్యం కావాలని అడిగితే, ఇక్కడ ఆ బియ్యం అందుబాటులో లేవంటూ వ్యాపారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు.
గోదాముల్లో నిల్వలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ ధరలకు అమ్మితే లాభాలు తగ్గుతాయనే ఉద్దేశంతోనే వ్యాపారులు ఈ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని . కేవలం ప్రచారం కోసం, అధికారులను మభ్యపెట్టడం కోసమే బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేస్తున్న వ్యాపారులపై పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం . పట్టణంలోని అన్ని బియ్యం దుకాణాలు, గోదాములపై ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమ నిల్వలను బయటకు తీయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ ధరలకు జై శ్రీ రామ్ బియ్యం అందుబాటులో ఉండేలా చూడాలని బెల్లంపల్లి ప్రజల తరుపున ఏంసిపిఐ యు పార్టీ గా డిమాండ్ చేస్తున్నాము
ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి మండల కార్యదర్శి తోగరి రాహుల్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, రాజేష్, ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


