తుమ్మలపల్లిలో 26 మందికి నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
దొడ్ల సాయన్నకు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మర్పల్లి, : తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి గ్రామంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చేయూత అందించారు. మంగళవారం మండల కేంద్రంలో నీ తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీలో భాగంగా గ్రామానికి చెందిన 26 మంది నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయడంతో పాటు, దొడ్ల సాయన్నకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ.60 వేల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మండల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీపై పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పసుల సురేష్, తుమ్మలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నె పాండు, ఉపసర్పంచ్ మ్యాతారి సురేష్, వార్డు సభ్యులు పసుల సతీష్, దూదేకుల ముజు, దొడ్ల రమేష్, దొడ్ల జయరాజు, అమరేశ్వర్, బిచప్ప తదితరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


