క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయం: మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య
ఐబీ ప్రీమియర్ లీగ్–2 విజేతలకు బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు అందజేత
బెల్లంపల్లి (మంచిర్యాల) : తాండూర్ ఐబీలో నిర్వహించిన ఐబీ ప్రీమియర్ లీగ్–2 క్రికెట్ పోటీల విజేతలకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బహుమతులతోపాటు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా విజేతలను అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని చిన్నయ్య పేర్కొన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతోపాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. యువ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దత్తు మూర్తి, ఎలుక రాంచందర్, గట్టు సంతోష్, మంగపతి సురేష్, దత్తాత్రేయరావు, రాములు, బోడ సతీష్, క్రిస్టఫర్, ప్రదీప్ రావు, జాడి పోచం, ఇక్బాల్, రాకేష్‌తోపాటు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


