నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక ఆదాయం పొందాలి - కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

ప్రత్యామ్నాయ పంటల సాగును క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ ముకురాల, పంజాగుల గ్రామాల్లో పర్యటన

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక ఆదాయం పొందాలి - కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌కర్నూల్ జిల్లా :  రైతులు పంటల వైవిధ్యాన్ని పెంచుకొని, నీటి పొదుపుతో పాటు అధిక ఆదాయం సాధించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు.

రైతులు సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగును పూర్తిస్థాయిలో తగ్గించి, తక్కువ నీటి వినియోగంతో అధిక ఆదాయం అందించే పంటలను ప్రోత్సహించాలని తెలిపారు.

ముకురాల, పంజాగుల గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముకురాల గ్రామంలో రైతు రాజేందర్ రెడ్డి సాగు చేస్తున్న ఆరు ఎకరాల పందిరి కూరగాయలు, చిక్కుడు పంటలను పరిశీలించారు. పంటల పెట్టుబడి వ్యయం, దిగుబడులు, నీటి వినియోగం, మార్కెటింగ్ అవకాశాలపై రైతులతో చర్చించారు. గ్రామంలో సాగు చేస్తున్న బొప్పాయి పంటను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

పందిరి కూరగాయలు, చిక్కుడు, బొప్పాయి సాగును విస్తరించాలని సూచించారు. పంటల మార్పిడి విధానంతో భూసారాన్ని కాపాడుకోవాలని, సాగు ఖర్చులు తగ్గించుకొని మెరుగైన ఆదాయం పొందాలని అన్నారు.కూరగాయలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, తృణధాన్యాల సాగును ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను గుర్తించి సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని, పంట వేసే ముందే మార్కెట్ ధరలు, పెట్టుబడి వ్యయం, దిగుబడి అవకాశాలను అంచనా వేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని అన్నారు.ముకురాల గ్రామంలో ఎద్దు గానుగ ద్వారా తయారు చేస్తున్న నూనె ఉత్పత్తులను కలెక్టర్ పరిశీలించారు. సంప్రదాయ గానుగ నూనెల తయారీ విధానం, నాణ్యత, విక్రయాలు, మార్కెటింగ్ అవకాశాలపై ఆరా తీశారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందాలని, స్థానిక వనరులతో చిన్నతరహా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ప్రోత్సహించాలని తెలిపారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News