తె. యూ. ఇంటర్ కళాశాలల కబడ్డీ (మెన్) టోర్నీ ఛాంపియన్ గా తెలంగాణ యూనివర్సిటీ జట్టు
నిజామాబాద్ : ఈ రోజు ఉదయం 11. గ లకు యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో కబడ్డీ టోర్నీ కం సెలెక్షన్స్ ను ప్రారంభించామని వర్సిటీ ఆర్గనైజ్ సెక్రెటరీ డా. బి. ఆర్. నేత తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జి బాలకిషన్ మాట్లాడుతూ క్రీడలు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా శారీరక ధరుడ్యo మరియు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని తెలిపారు. ఈ టోర్నీ లో సెలెక్టైన క్రీడా కారులు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ మెన్ టోర్నమెంట్ 28-31 డిసెంబర్ 2026, న ఏనోపోయా యూనివర్సిటీ , బెంగళూరు లో తె. యూ టీం గా పాల్గొంటారని, అందులో మంచి ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ కి మంచి పేరు, ఖ్యాతి నీ తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ టోర్నీ లో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల నుండి 9 కళాశాలలు పాల్గొన్నాయని తెలిపారు. టోర్నీ ఛాంపియన్ గా తెలంగాణ యూనివర్సిటీ జట్టు , రన్నర్ గా ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల, కామారెడ్డి, నిలిచాయని ఆయన పేర్కొన్నారు. కాగా విజేతలకు సర్టిఫికేట్స్, మోడల్స్, మరియు ట్రోఫీ లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ ప్రో. బాలమణి, అనిల్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డా. బి. ఆర్. నేత జూనియర్ అసిస్టెంట్ జాదవ్ నరేష్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


