ఇంకుడుగుంతల ప్రాధాన్యతపై అవగాహాన కల్పించాలి -ఎంపీడీఓ విజయకుమారి
త్రిపురారం : ఇంకుడుగుంతల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహాన కల్పించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఉందని ఎంపీడీఓ విజయకుమారి అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల ప్రజా పరిషత్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 100 ఇంకుడు గుంతల తక్కువ కాకుండా తీయించాలన్నారు. దీని వల్ల భూగర్భజలాలు పెరిగి మంచి నీటి సమస్యను అధిగమించవచ్చునని సూచించారు. అంతేకాకుండా విద్యుత్ ను ఆదా చేయాలని సూచించారు. ముఖ్యంగా ఈ రబీలో రైతులు వరి పైరును సాగు చేయకుండా మెట్ట పంటలు సాగు చేసే విధంగా రైతులకు సంబంధిత అధికారులు తగిన సూచనలు చేయాలన్నారు. గృహా అవసరాలకు అవసరమైన మేర మాత్రమే నీటిని వినియోగించాలని ముఖ్యంగా నీటి వృధాను అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహాసీల్దార్ ప్రమీల, మండల ప్రత్యేకాధికారి లీలా, విద్యుత్ ఏఈ బాలూనాయక్, మండల విద్యాధికారి రవినాయక్, మండల వ్యవసాయాధికారి పార్వతీచౌహాన్, ఏపీఓ శ్యామల, పశువైద్యాధికారి నాగేందర్, మండల వైద్యాధికారి వనిత, ఎంపీఓ శివ, మాజీ పీఏసీఎస్ చైర్మెన్ జయరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

